ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రముఖ కవి శ్రీ దేవులపల్లి విశ్వనాథం రచించిన ప్రేమదీపం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆంజనేయులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... కవిత్వం సమాజాన్ని మేలుకొలిపే విధంగా ఉండాలని, కవులు, కళాకారులు సమాజహితం కోసం రచనలు చేయాలని చెప్పారు.
నేటి ఆధునిక యుగంలో పుస్తక పఠనం తగ్గిపోయిందని... టెక్నాలజీ పెరిగి మానవ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తుందని పేర్కొన్నారు. దేవులపల్లి విశ్వనాథం గారికి సమాజం పట్ల ఉన్న నిబద్ధత, ప్రేమ అనేవి ఆయన రచనలో కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు.