ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనికరించని వైద్యులు.. ఆసుపత్రి బయటే ప్రసవం

పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. చివరికి.. ఆసుపత్రి ఎదుటే ప్రసవం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చూసిన వారందరూ వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

pregnant delivered on road
ఆసుపత్రి బయటే గర్భిణి ప్రసవం

By

Published : May 13, 2021, 7:28 PM IST

Updated : May 13, 2021, 7:44 PM IST

ఆసుపత్రి బయటే గర్భిణి ప్రసవం..

ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణి.. నడిరోడ్డుపై ప్రసవించింది. ఈ ఘటన సాయి సింధూర వైద్యశాల ఎదుట చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా ప్రభుత్వ హాస్పటల్​ను కోవిడ్ వైద్యశాలగా మార్చిన కారణంగా... అక్కడి కాన్పుల వార్డును తాత్కాలికంగా ఉన్నతాధికారుల నిర్ణయంమేరకు.. సాయి సిందూర ఆసుపత్రికి తరలించారు. బెస్తవారిపేట మండలం గార్లకుంటకు చెందిన గర్భిణి త్రివేణి.. పురుటినొప్పులతో వైద్యం కోసం మధ్యాహ్నం 2 గంటలకు ఆసుపత్రి వద్దకు చేరుకుంది.

వైద్యులు ఆమెకు మంచం కేటాయించకుండా.. గంటల తరబడి వైద్యశాల బయటే నిరీక్షింపచేశారు. ఎంత బతిమాలుకున్నా ఫలితం లేక.. ఆమెను ఒంగోలు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో... నొప్పులు ఎక్కువైన ఆమె.. నడి రోడ్డుపైనే ప్రసవించింది. ఈ ఘటన చూసిన వారు ఆసుపత్రి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితే తమకూ ఎదురైందని మరో గర్భిణి బంధువులు తీవ్ర ఆవేదన చెందారు.

Last Updated : May 13, 2021, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details