ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణీ దండెబోయిన గాలెమ్మ విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఇంట్లో టీవీ పెట్టేందుకు స్విచ్ వేయబోగా.. విద్యుత్ సరఫరా జరిగి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వారం, పది రోజుల్లో ప్రసవించాల్సిన ఆమె విద్యుత్ షాక్తో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈమెకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.
విద్యుదాఘాతంతో నిండు గర్భిణీ మృతి - Pregnant death with electrocution in markapuram
విద్యుదాఘాతంతో నిండు గర్భిణీ మృతి చెందింన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలో జరిగింది. టీవీ స్వీచ్ వేయబోయి విద్యుత్ సరఫరా కావటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
విద్యుదాఘాతంతో నిండు గర్భిణీ మృతి