ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తేజస్విని కుటుంబానికి.. మంత్రి తనయుడు ఆర్థిక సాయం - prakasham district latest news

ఒంగోలులో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని తేజస్విని కుటుంబాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి పరామర్శించారు. ధైర్యం చెప్పారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

Praneeth Reddy visiting Tejaswini's family
తేజస్విని కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం

By

Published : Feb 7, 2021, 5:01 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న తేజస్విని ఆత్మహత్యపై.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి ఆవేదన చెందారు. గొడుగుపాలెంలోని విద్యార్థిని ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి.. ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయం అందేలా తనవంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యపై పోలీసులు సమగ్ర విచారణ చేసి.. కారణాలు తెలుసుకుంటారన్నారు.

ABOUT THE AUTHOR

...view details