విధి నిర్వహణలోనూ సమాజ సేవ చేస్తున్న పోలీసులు - LATEST NEWS OF MARTOOR
అత్యవసర పరిస్థితుల్లో వెళుతున్న వారికి ఆహారం అందజేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. దారిలో తినేందుకు బిస్కెట్ ప్యాకెట్లను సైతం అందిస్తూ... కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పిస్తున్నారు.
లాక్ డౌన్ విధుల్లో పాల్గొంటూనే భోజనాలు వడ్డించిన పోలీసులు
లాక్ డౌన్ విధుల్లో పాల్గొంటూనే పోలీసులు పలువురికి భోజనాలు వడ్డించిన ఘటన స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడి జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఎస్.ఐ శివకుమార్ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. నిబంధనలకు అనుగుణంగా, అత్యవసర పరిస్థితుల్లో వెళుతున్న వారికి పోలీసులే భోజనాలు వడ్డించారు. దారిలో తినేందుకు బిస్కెట్ పొట్లాలు సైతం అందజేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన సైతం కల్పించారు.