ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP MLA'S : సీఎంకు ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేల లేఖ - prakasham district TDP mla's write a letter

సీఎం జగన్‌(CM jagan)కు ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు(prakasham district TDP MLA'S) లేఖ(letter) రాశారు. జిల్లా సమస్యలు పరిష్కరించాలని కోరారు. జిల్లా సమస్యలను సీఎం పట్టించుకోవడం లేదని లేఖలో ప్రస్తావించారు.

సీఎంకు ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేల లేఖ
సీఎంకు ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేల లేఖ

By

Published : Oct 16, 2021, 4:58 PM IST

జిల్లా సమస్యలు(prakasham district problems) పరిష్కరించాలని కోరూతూ... ముఖ్యమంత్రి జగన్‌కు(CM Jagnan) ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు(TDP MLA'S) లేఖ రాశారు. జిల్లా సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌(gottipati ravikumar), బాలవీరాంజనేయస్వామి(bala veeranjaneyaswamy), ఏలూరి సాంబశివరావు(eluri samba shiva rao) సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

జిల్లాకు సీఎం రాక సంతోషం కన్నా ఎక్కువ.. విచారాన్నే మిగిల్చిందని విమర్శించారు. తాము లేవనెత్తిన సమస్యల్లో ఏ ఒక్కదానికీ పరిష్కారం చూపే ప్రయత్నమే చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ(veligonda)ను అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గెజిట్‌లో చేర్చే అంశం, జిల్లా అభివృద్ధిపైనా సమాధానం చెప్పలేదని లేఖలో పేర్కొన్నారు. కేవలం రాజకీయ విమర్శలపైనే దృష్టి సారించారని విమర్శించారు.

ఇదీచదవండి.

RK funeral photos: ఆర్కే అంత్యక్రియలు పూర్తి.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

ABOUT THE AUTHOR

...view details