ప్రకాశం జిల్లాలో ప్రార్థన మందిరాల్లో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించటంతో పాటు.. భక్తుల మనోభావాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు పలు కార్యక్రమాలు చేపట్టారు. పోలీసు సిబ్బంది దేవాలయాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లు పరిశీలించాలని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఆదేశించారు. మతపరమైన గొడవలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మతపరమైన గొడవలు జరిగితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మతపరమైన విద్వేషాలు సృష్టించే అనుమానితుల జాబితాలను తయారు చేసి.. వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. మతపర విద్వేషాలు సృష్టించే వారి గురించి కంట్రోల్ రూమ్ నెంబర్ 9121102266కు గానీ, డయల్ 100కి గాని ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
'పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి '
ప్రస్తుతం రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో.. ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఎటువంటి మత గొడవలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ.. పోలీసు సిబ్బందికి సూచించారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ