ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ డ్రైవర్​ను బెదిరించి.. చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్ - prakasham news

లారీ డ్రైవర్​ను బెదిరించి చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయలు నగదు, ఓ కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

prakasham district police cought three thefts
prakasham district police cought three thefts

By

Published : Sep 11, 2021, 1:29 PM IST

ప్రకాశం జిల్లాలో లారీ డ్రైవర్​ను బెదిరించి చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల నగదు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

బెదిరించి.. డబ్బు ఎత్తుకెళ్లారు..

ఈ నెల 6వ తేదీన ఓ గ్రానైట్ లారీ బల్లికురవ మండలం కొణిదెన మీదుగా వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు లారీని అడ్డగించారు. తాము పోలీసులమని.. ఎస్సై పంపించారని చెప్పి బెదిరించారు. నగదు దొంగిలించి పారిపోయారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి పట్టుకున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక్‌ గార్గ్‌ తెలిపారు.

ఇదీ చదవండి:PROTEST: నీళ్లు, విద్యుత్ కోసం గ్రామస్థుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details