ఫలితాలు వెల్లడించి, ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వకపోవటం ఏమిటని ప్రకాశం జిల్లా గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శులు ప్రశ్నించారు. తమను తక్షణమే విధుల్లోకి తీసుకుంటున్నట్లు నియామక పత్రాలు అందజేయాలని ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. అధికారులు తమ సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో 172 మందిని ఎంపిక చేస్తున్నట్లు ఐదు నెలల క్రితం ప్రకటించారని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు. ఇతర జిల్లాల్లో నియామకాలు పూర్తి చేసినప్పటికీ ఈ జిల్లాలో ఇంతవరకు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శుల ఆందోళన - prakasham district grop three candidates
తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
ప్రకాశం జిల్లా గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శుల ఆందోళన