ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు నిర్వహించిన పరిక్షామే చర్చా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎమ్. పల్లవి దేశం దృష్టిని ఆకర్షించింది. తొలిసారిగా మన రాష్ట్రం నుంచి ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం దక్కించుకుంది. పొదిలికి చెందిన ఎమ్ మోహనరావు, సంపూర్ణ చిన్న కుమార్తె పల్లవి. పొదిలి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదొ తరగతి చదువుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎన్ఎమ్ఎమ్ఎస్ పరీక్షలో జిల్లాలో రెండవ ర్యాంక్ సాధించింది. ఏటా 12 వేల రూపాయల ఉపకార వేతనం సైతం పొందుతుంది.
తండ్రి మోహనరావు స్థానికంగా ఉండే ఓ ఫర్నిచర్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివించారు. ఆ తర్వాత ఫీజులు కట్టలేక ఇద్దరి కుమార్తెలను పొదిలి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రధానమంత్రితో తమ అమ్మాయి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు మోహనరావు, సంపూర్ణ ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పల్లవిని అభినందించారు.
ప్రధాని, పల్లవి మధ్య జరిగిన సంభాషణ..