ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలో 296 పోలింగ్ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. 73 సమస్యాత్మక కేంద్రాల్లో మరింత పటిష్టంగా ఏర్పాట్లు చేశామంటున్నారు. నియోజకవర్గం పరిధిలో 2వేల 240 మంది అధికారులు ఎన్నికల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. ఈసీ అధికారులకు అండగా పోలీసు బలగాలు గ్రామాలకు చేరుకున్నారు.
అద్దంకి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం - అద్దంకి
ప్రజలు ఓట్లు వేసి నేరుగా ఇంటికే వెళ్లాలని ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంపులుగా చేరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్నారు.
అద్దంకి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు.