ప్రకాశం జిల్లా ఆశా జ్యోతి ...పూలసుబ్బయ వెలిగొండ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. కొత్తూరు సమీపంలో గల వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కేనాల్స్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్ట్ జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయని అన్నారు. ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
అడ్డంకులు అధిగమించి పనులు చేస్తాం... - Pulasubbaya Veligonda project news
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని తొలి సొరంగం ముఖ ద్వారం వద్ద గుత్తేదారులు, అధికారులు, ఇంజినీర్లతో వెలిగొండ పనుల పురోగతిపై ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
![అడ్డంకులు అధిగమించి పనులు చేస్తాం... prakasham District Collector Pola Bhaskar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8854712-22-8854712-1600483413503.jpg)
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రాజెక్ట్ పనులు లక్ష్యం మేర జరగలేదన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి సొరంగం పనులు 396 మీటర్లు మాత్రమే చేపట్టవలసి ఉందని.... అక్టోబర్31 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ వద్ద వెనుక వైపు నుంచి150 మీటర్లు సొరంగం పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రాజెక్ట్ను వేగవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి:గండికోట జలాశంలోకి భారీగా వరదనీరు.. ముంపు గ్రామాల్లో బాధితుల కష్టాలు