ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల సాయం - prakasham district collector update

కళాశాల ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తేజశ్రీ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున విద్యార్థిని కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

exgratia
విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం

By

Published : Feb 8, 2021, 4:25 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో.. కళాశాల ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న తేజశ్రీ నివాసానికి జిల్లా కలెక్టర్ భాస్కర్ వెళ్లారు. విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు. విద్యార్థిని అక్కకు అవుట్​ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

2018 - 19 ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు అన్నీ విడుదల అయ్యాయని.. విద్యార్థిని చదవుతున్న కాలేజీలో మాత్రం నిధులు విడుదల కాలేదని చెప్పారు. కాలేజీకి సంబంధించిన కేసు కోర్టులో ఉండటంతో.. ఫీజు రీయింబర్స్​మెంట్ నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. ఆ కేసును నవంబర్ 2020లో కాలేజీ యాజమాన్యం విత్​డ్రా చేసుకుందనీ... ఎన్నికలు పూర్తైన తర్వాత నిధులు విడుదల చేస్తామని అన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details