చెరువు గట్టుపై తెదేపా విస్తృత ప్రచారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉదయం నడకకు వచ్చిన వారితో తెదేపా నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఒంగోలు రంగరాయ చెరువు గట్టుపై వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో రాష్ట్ర మంత్రి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శిద్దా రాఘవరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడారు.ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లుఅభ్యర్థించారు. మళ్లీ తెదేపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గాంధీ పార్కు, రంగరాయ గట్టు అభివృద్ధికి ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు.