ఒంగోలు అసెంబ్లీ దామచర్ల జనార్థన్ రావు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో 1999 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. 15 ఏళ్లపాటు బాలినేని శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసిన శ్రీనివాసరెడ్డిపై తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దనరావు విజయం సాధించారు. విజయం సాధించినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించానని చెబుతున్నారాయన. ఐదేళ్లలో చేసిన అభివృద్ధే మళ్లీ తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెదేపా విజయఢంకా మోగించింది. బాలినేని శ్రీనివాస రెడ్డిపై గెలుపొందిన దామచర్ల జనార్దనరావు... ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశానని ప్రగతి నివేదిక విడుదల చేశారు.మురికి కూపంలా ఉన్న నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామంటున్నారు.
ఒంగోలు ప్రగతి:
-
ఒంగోలులో డంపింగ్ యార్డు నిర్మాణం
-
పార్కులు, సీసీ రోడ్లతో నగర సుందరీకరణ
-
రూ.119 కోట్లతో గ్రామాలకు రహదారులు
-
పలు గ్రామాలకు 11 వంతెనల నిర్మాణం
రూ.190 కోట్లతో ఎడగండ్లపాడు నుంచి నీళ్లు
ఎన్టీఆర్ గృహకల్ప, సంక్షేమ పథకాల అమలు
ఇవీ చూడండి.
తెలుగుదేశంలో కదం తొక్కుతున్న కుర్రాళ్లు...!