ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి ఎద్దడి నివారించాలి: కలెక్టర్ - నీటి ఎద్దడి

గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ పోలా భాస్కర్

By

Published : Jun 18, 2019, 11:43 PM IST

కలెక్టర్ పోలా భాస్కర్

తాగునీటి సరఫరాలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను హెచ్చరించారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో ఉపాధిహామీ పథకం, నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ట్యాంకర్ల సంఖ్య పెంచాలన్నారు. పెండింగ్​లో ఉన్న రూ.4 కోట్ల బకాయిలు విడుదల అయ్యాయని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామి కూలీల సంఖ్య పెంచి ఆర్థికంగా కూలీలను ఆదుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details