చీమకుర్తి సాగర్ కాలవలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా చీమకుర్తి సాగర్ మేజర్ కాలువ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కాలువలోని మూడో గేటు వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల ప్రజల దగ్గర వివరాలు సేకరించారు. ఈతకు వచ్చి చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావించారు.