ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Prakasham: ప్రకాశం జిల్లాలో అస్తవ్యస్థంగా రహదారులు - ప్రకాశం జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అస్తవ్యస్థంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల రోడ్డు పనులు ప్రారంభించి సగంలోనే వదిలేయటంతో ప్రయాణికులకు అవస్థలు తప్పటం లేదు. గుంతల రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నా... అధికారులు పట్టించుకోవటం లేదని వాహనదారులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాలో అస్తవ్యస్థంగా రహదారులు
ప్రకాశం జిల్లాలో అస్తవ్యస్థంగా రహదారులు

By

Published : Oct 3, 2021, 4:51 PM IST

ప్రకాశం జిల్లాలో అస్తవ్యస్థంగా రహదారులు

ప్రకాశం జిల్లాలో రహదారుల నిర్మాణాలు జరగకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిచోట్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా.. గుత్తేదారులు ముందుకు రాక పనులు ప్రారంభం కాలేదు. మరికొన్ని చోట్ల దాదాపు 10 నెలల క్రితం మొదలుపెట్టిన గ్రామీణ రహదారుల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సింగరాయకొండ నుంచి చుట్టుపక్కల పల్లెలకు వెళ్లే రహదారులతో పాటు నాగులప్పలపాడు మండలం చదలవాడ నుంచి అమ్మనబ్రోలు వరకు రహదారి పనులు ప్రారంభించి... కంకర రాళ్లు పేర్చి వదిలేశారు. ఆ మార్గాల్లో ప్రయాణించే వారు నరకయాతన అనుభవిస్తున్నారు.

గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవటం వల్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయనే విమర్శలూ ఉన్నాయి. సగం పనులు చేసి వదిలేసిన రహదారుల నిర్మాణం తిరిగి మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోంది. మధ్యలో పనులు ఆపేసిన రహదారులపై రాళ్లు తేలి, గోతులు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారాయి. రోడ్ల మధ్యలో ఉన్న కల్వర్టులు కూడా కూలిపోయే స్థితికి చేరుతున్నాయని.. వాటి నిర్మాణాలు కూడా చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. అధికారులు దృష్టి సారించి రహదారుల నిర్మాణం పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:AUTO ACCIDENT : ఆటో బోల్తా... 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details