ప్రకాశం జిల్లా దర్శి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో అద్దంకిలోని స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తరువాత గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను పసిగట్టి... రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ఆరా తీసి ముందస్తు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ఫలితాల లెక్కింపు దృష్ట్యా జిల్లా ఎస్పీ సమీక్ష - addanki
ప్రకాశం జిల్లా దర్శిలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు.
ఫలితాల లెక్కింపు దృష్ట్యా జిల్లా ఎస్పీ సమీక్ష
Last Updated : May 21, 2019, 9:38 AM IST