ప్రకాశం జిల్లా పోలీసుల అమలు చేసిన రెండు ప్రాజెక్టులు ఆర్డర్ ఆఫ్ మెరిట్ స్కోచ్ అవార్డు-2020కు ఎంపికయ్యాయి. దశ సూత్రాలు, సద్భావన ప్రాజెక్టులకు పురస్కారం దక్కిందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. దిల్లీ నుంచి స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చార్, పశ్చిమ బెంగాల్ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశి పంజా ఆన్లైన్ ద్వారా 67వ జాతీయ ఆర్డర్ ఆఫ్ మెరిట్ స్కోచ్ అవార్డు-2020లను ప్రకటించారు.
దశ సూత్రాల ప్రాజెక్ట్
గత నెలలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, దశసూత్రాలు ప్రాజెక్ట్‌పై ఆన్లైన్ ద్వారా స్కోచ్ జ్యూరీ సభ్యులకు ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజలు కరోనా బారిన పడకుండా దశ సూత్రాలు ఉపయోగపడుతున్నాయని వివిధ రంగాలకు చెందిన ఆరుగురు జ్యూరీసభ్యులు ప్రశంసించారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కు ఎంపిక చేశారు.
సద్భావన ప్రాజెక్ట్
సద్భావన అనగా పాత నేరస్తులు, ముద్దాయిలు, చెడు నడత కలిగిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. వారు గౌరవంగా జీవించే విధంగా ఏర్పాటు చేయడం. నేరరహిత సమాజం ఏర్పడేలా చేయటం దీని ముఖ్య ఉద్దేశ్యం. వివిధ రంగాలకు చెందిన జ్యూరీ సభ్యులకు ప్రాజెక్టును వివరించారు. మంచి ప్రాజెక్డుగా గుర్తింపు పొందడంతో, ఇది కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కు ఎంపిక అయ్యింది. జిల్లా పోలీస్ శాఖలోని రెండు ప్రాజెక్టులు ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కు ఎంపిక కావడంతో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ యంత్రాంగాన్ని అభినందించారు.
బాధ్యత పెరిగింది
ప్రకాశం జిల్లాకు చెందిన రెండు ప్రాజెక్టులు ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కు ఎంపిక కావడం పట్ల ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగంపై మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: