ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలో రాష్ట్ర వైకాపా ప్రభుత్వ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో టైలర్లు, నాయీబ్రాహ్మణులు, రజకులు కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... రాష్ట్రంలో మంచి మనసున్న ముఖ్యమంత్రి పరిపాలన సాగుతుందని కొనియాడారు. ఇచ్చిన హామీలు 90 శాతం మేర అమలు చేశారని, అన్నీ వర్గాల వారికి ఈ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
జగనన్న పాలన... మంచి మనసున్న పాలన - ఈటీవీ భారత్ తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిపొందిన టైలర్లు, నాయీబ్రాహ్మణులు, రజకులు కలిసి ప్రకాశం జిల్లాలోని పుట్టవారిపాలెంలో... ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో మంచి మనసున్న ముఖ్యమంత్రి పాలన సాగుతుందని కొనియాడారు.
మంచి మనసున్న పాలన మా జగనన్న పాలన