ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం - thunderstorms in AP news

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రైతులు, కూలీలు, పశువుల కాపరులు బహిరంగ ప్రాంతాల్లో ఉండవద్దని సూచించింది. సురక్షిత భవనాల్లోనే ఆశ్రయం పొందాలని విపత్తుశాఖ కమిషనర్‌ సూచించారు.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం

By

Published : May 18, 2021, 6:15 PM IST

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. వెలిగండ్ల, కంభం, మార్కాపురం, బెస్తవారిపేటలో పిడుగులు పడే ప్రమాదం ఉందని వెల్లడించింది. తర్లుపాడు, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, కనిగిరి, పెదచెర్లోపల్లి, పామూరు, చంద్రశేఖరపురం, వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరులో పిడుగులు పడే అకాశముందని తెలిపింది. కొండాపురం, ఉదయగిరిలో మండలాల పరిసరాల్లో పిడుగులు ఎక్కువగా పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రైతులు, కూలీలు, పశువుల కాపరులు బహిరంగ ప్రాంతాల్లో ఉండవద్దని సూచించింది. సురక్షిత భవనాల్లోనే ఆశ్రయం పొందాలని విపత్తుశాఖ కమిషనర్‌ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details