ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి రైతులకు  ప్రకాశం జిల్లా కర్షకుల సంఘీభావం

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో వెంటనే పనులు ప్రారంభించి చిత్తశుద్దిని చాటుకోవాలని ప్రకాశం జిల్లా అమరావతి పరిరక్షణ సమితి రైతులు డిమాండ్​ చేశారు. అమరావతి రైతుల పోరాటం 220వ రోజు సందర్భంగా సంఘీభావం తెలిపారు.

Prakasam farmers
అమరావతి రైతులుకు సంఘీభావం తెలిపిన ప్రకాశం కర్షకులు

By

Published : Jul 24, 2020, 8:17 PM IST


ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామం రైతులు అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతుల పోరాటం 220వ రోజుకు చేరుకున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి నేతలు సురేష్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామస్థులు, రైతులు సంఘీభావం తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరాలంటే అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి కొనసాగించాలని నినదించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల బిల్లును గవర్నర్​కి పంపటం ప్రభుత్వం చేస్తున్న హేయమైన చర్య అని ప్రకాశం జిల్లా తెదేపా లీగల్ సెల్ అద్యక్షుడు పరిటాల సురేష్ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details