ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్.. ఒంగోలులో సమీక్షించారు. కరోనా కారణంగా.. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని, అదే విధంగా ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించడం, లాక్‌డౌన్ కార్యక్రమంలో పాల్గొనడం బాధ్యతగా భావించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ పరిస్థితులు అదుపులో ఉన్నాయని అన్నారు. 939 కేసులు ఉండగా వాటిలో 18 మినహా మిగతా వారంతా వైద్య బృందాల పర్యవేక్షణలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. విదేశాల నుంచి వచ్చిన 18 మంది ఆచూకీ లభ్యం కాలేదని చెప్పారు. వారిని ఎక్కడున్నా గుర్తించి హోమ్ క్వారంటైన్‌లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
'ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది' - prakasam dst collector latest press meet
వచ్చే నెల 14 వరకూ అమల్లో ఉన్న లాక్ డౌన్ కారణంగా.. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుతున్నామని ప్రకాశం కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. పౌర సరఫరాల అధికారులతో పాటు, వాణిజ్య, వర్తక వ్యాపార సంస్థల ప్రతినిధులు స్వఛ్చంద సంస్థల ప్రతినిధులతో చర్చించారు.
!['ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది' prakasam dst collector latest press meet on lockdown situation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6546252-423-6546252-1585207725587.jpg)
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్