ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్షేమంగా ఉండండి.. అన్ని ఏర్పాట్లు చేస్తాం - ప్రకాశం జిల్లాలో మిర్చి వలస కూలీల కష్టాలు

ప్రకాశం జిల్లా పొదిలి నుంచి రెంటచింతల గ్రాామానికి మిర్చి కోతలకు వచ్చిన వలస కూలీలు లాక్​డాన్​ కారణంగా అవస్థలు పడ్డారు. గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు ,వారితో మాట్లాడి కాలినడకన వెళ్లడం ఇబ్బందికరమని భోజన వసతి సౌకర్యం కల్పించి కొన్ని రోజులు అక్కడే ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు.

migrant labours problms due to lockdown at praksam
క్షేమంగా ఉండండి.. అన్ని ఏర్పాట్లు చేస్తాం

By

Published : Apr 27, 2020, 8:59 AM IST

ప్రకాశం జిల్లా పొదిలి నుంచి రెంటచింతల గ్రామానికి లాక్‌డౌన్‌ ముందు మిర్చి కోతలకు కూలీలు వలస వచ్చారు. వారంతా ఆదివారం రెంటచింతల నుంచి పొలాల గుండా స్వగ్రామం పొదిలి వెళ్లేందుకు కాలినడకన దుర్గి వచ్చారు. వీరిని చూసిన గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు వారితో మాట్లాడారు. ఎండల్లో నడుచుకుంటూ వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేయడం ఇబ్బందికరమని, కొన్నిరోజులు ఇక్కడే ఉండాలని భోజన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఎస్సై రామాంజనేయులుతో మాట్లాడి దుర్గిలో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఐతే వీరిలో ఒక నిండు గర్భిణి తాను వెళతానని స్వగ్రామం వెళితే ఇబ్బందులు లేకుండా ఉంటానని కన్నీటి పర్యంతమైంది. ద్విచక్రవాహనంపై ఆమెను వెళ్లేందుకు అనుమతి ఇచ్చి వారికి తాగునీరు, తినేందుకు బిస్కెట్లు ఇచ్చి జాగ్రత్తగా స్వగ్రామానికి చేరాలని సూచించారు. గ్రామానికి చేరగానేే చరవాణి నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని డీఎస్పీ పేర్కొన్నారు. వలస కూలీలకు ఎస్సై రామాంజనేయులు స్థానికంగా వసతి కల్పించారు. అంతకు ముందు ముటుకూరులోని వలస కూలీల్లో ఒక మహిళ తమ స్వగ్రామం వెళ్లాలంటూ రెండ్రోజులుగా సరిగా భోజనం చేయకుండా నీరసించింది. సమాచారం అందుకున్న డీఎస్పీ అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం డీఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ నరసరావుపేట వైద్యశాలలో వైద్యం చేయించుకున్న వారిని అధికారులు గుర్తించి వారికి పరీక్షలు చేయించారని ఎవరికీ ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసు లేదని తెలిపారు. పొలం పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అయితే రైతులు సహకరించి కూలీలను గుంపులుగా తీసుకెళ్లొద్దని కోరారు. ఆటోలను, ప్రైవేటు వాహనాలను మండలం దాటి వెళ్లేందుకు అనుమతులు లేవని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్‌ ఉపవాస దీక్షలు, ప్రార్థనలు గృహాల్లోనే కొనసాగించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details