మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా మద్యం, నాటుసారా సరఫరా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ వి.అరుణకుమారి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం మండలాల్లో నాటుసారా, మద్యం అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించారు.
మద్యం, నాటుసారా సరఫరా చేస్తే కఠినచర్యలు: సెబ్ సూపరింటెండెంట్ - municipal elections latest news
ఎన్నికల్లో ఎవరైనా మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ వి. అరుణకుమారి హెచ్చరించారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో నాటుసారా, అక్రమ మద్యం నిల్వలను ధ్వంసం చేశారు.
సెబ్ సూపరింటెండెంట్
అక్కయిపాలెం, లక్ష్మీపురం ప్రాంతాల్లోని పొలాల్లో 850 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసి 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు అధికారిణిని అరుణకుమారి తెలిపారు.
ఇదీ చదవండి:అల్లర్లకు తావులేకుండా భద్రత: ఏఎస్పీ రవిచంద్ర