ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మేము అండగా ఉంటాం...ధైర్యంగా ఓటు వేయండి' - ఎన్నికలపై ఎస్పీ సిద్దార్థ కౌశల్ కామెంట్స్

ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా, ఓటును దైర్యంగా వినియోగించుకునేటట్లు తాము అండగా ఉంటామని... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాని జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అన్నారు.

SP Siddhartha Kaushal
ఎస్పీ సిద్దార్థ కౌశల్

By

Published : Feb 6, 2021, 8:22 PM IST

''ఎన్నికల ప్రక్రియను మూడు భాగాలుగా విభజించి తగిన ప్రణాళికలు వేసుకున్నాం...ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయం, ఎన్నికల తరువాత అనే అంశాలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఎక్కువగా పోలీస్‌ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి, ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నాం... సజావుగా ఎన్నికలు జరగడానికి ప్రజలు తమ వంతు బాధ్యతలను గుర్తు చేస్తున్నాం.. పాత నేరస్తులను గుర్తించి, వారిని బైండవర్‌ చేస్తున్నాం. లైసెన్స్‌ ఆయుధాలను స్వాధీనపరుచుకున్నాం.. ఎన్నికల సమయంలో ఎంత మంది సిబ్బంది ఉండాలి? వారి విధులేమిటి? సంచార బృందాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయంపై ప్రణాళిక రచించాం.. ఎన్నికలు తరువాత కూడా విజయయాత్రలు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. ప్రతీకార చర్యలు, గొడవలు లేకుండా ప్రజల్లో మంచి వాతావరణాన్ని ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాం..- సిద్దార్థ కౌశల్‌, ఎస్పీ.

ప్రకాశం జిల్లాలో నాలుగు విడతలుగా సాగే ఎన్నికల కోసం వెయ్యికి పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు సిబ్బందితో పాటు మిగతా శాఖల వారిని కూడా వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు నిరోధానికి ప్రత్యేకంగా ఒక్కో ఫ్లయింగ్‌ స్వ్కాడ్, రెవెన్యూ, పోలీసులతో మొబైల్‌ టీం, ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసుల మధ్య మంచి అవగాహన ఉండటంతో....జిల్లా కలెక్టర్​తో రోజుకు 3, 4 సార్లు పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.. ఎన్నికల సంబంధించి ఉత్తర్వులను అమలు చేయడం, క్షేత్ర స్థాయిలో అమలుపరచడం వంటి వాటిపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ తెలిపారు. జిల్లాలో యంత్రాంగం పనితీరును ఎస్ఈసీ కూడా అభినందించినట్లు ఎస్పీ తెలిపారు.

సమస్యత్మాక ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించటంతోపాటు...ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు పోలీసులు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు పూర్తి చేసేందుకు సహకరించాలని ఎస్పీ కోరారు.

ఇదీ చదవండి:

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details