ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో 65 మందిపై రౌడీషీట్లు తొలగింపు - prakasam district latest news

సత్ప్రర్తనతో నడుచుకుంటున్న 65 మందిపై రౌడీషీట్లను తొలగిస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరంలో సరికొత్త జీవితం ప్రారంభించాలని వారికి ఎస్పీ సూచించారు.

SP Siddharth Kaushal
SP Siddharth Kaushal

By

Published : Jan 2, 2021, 4:46 AM IST

నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాశం జిల్లాలో 65మందిపై రౌడీ షీట్లను తొలిగించారు ఎస్పీ సిద్దార్థ కౌశల్‌. వారి సత్ప్రర్తన
కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. 'నూతన సంవత్సరం- నూతన జీవితం' పేరిట ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రౌడీ అనే ముద్ర నుంచి బయటపడాలి అంటే మంచి నడవడిక ఒక్కటే మార్గం అని అన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details