ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఒంగోలు పట్టణంలో బుల్లెట్‌పై పర్యటించారు. కురిచేడులో శానిటైజర్లు సేవించి మరణాలు సంభవించిన నేపథ్యంలో పట్టణంలో అవగాహన కల్పించారు. ఈ తరహా మరణాలకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. అందులో భాగంగా అద్దంకి బస్టాండ్ రోడ్డు, రైల్వే స్టేషన్, కొత్త మార్కెట్ సెంటర్, సంఘమిత్ర ఆస్పత్రి సెంటర్లలో ఆయన పర్యటించారు.
శానిటైజర్లను సేవించడం వల్ల కలిగే ప్రాణనష్టం గురించి ఎస్పీ వివరించారు. కురిచేడు ఘటనపై మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని... దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.