ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం చాటుకున్న పెద్దచెర్లోపల్లి ఎస్సై - మానవత్వం చాటుకున్న పెద్దచెర్లోపల్లి ఎస్సై తాజా సమాచారం

నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరవ్వడం, సమయానంతరం ఇంటికి వెళ్లడం, నెలయ్యేసరికి జీతాలు తీసుకోవడం పరిపాటే. కానీ కొందరు మాత్రం విధులు నిర్వహిస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటారు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు.. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండల పోలీస్ స్టేషన్​ ఎస్సై ప్రేమ్ కుమార్. వాగులో మునిగిపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు స్థానికులు ముందుకు రాని పరిస్థితుల్లో.. స్వయంగా తనే వాగులోకి దిగి బయటకు తీశారాయన.

Prakasam District Peddacherlopalli SI who expressed humanity
మానవత్వం చాటుకున్న పెద్దచెర్లోపల్లి ఎస్సై

By

Published : Jan 27, 2021, 9:28 AM IST

విధి నిర్వహణలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండల పోలీస్ స్టేషన్​కి చెందిన ఎస్సై ప్రేమ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని బట్టుపల్లి గ్రామంలోని పాలేటి వాగులోకి ఈత కోసం దిగిన ఇద్దరు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు.

వారి మృతదేహాలను వెలికి తీసేందుకు స్థానికులు తటపటాయించారు. ఈ క్రమంలో ఎస్సై దైర్యంగా వాగులోకి దిగి.. ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. అందరితో శభాష్ అనిపిచ్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details