ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్దలకేనా ? పేదలకు లేవా..? - పామూరు ఎంపీడీవో రంగ సుబ్బారాయుడు పై స్థానికుల ఆరోపణలు

Pensions: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్దలకేనా ? పేదలకు లేవా..? అంటూ ప్రకాశం జిల్లా పామూరులో క్షేత్రస్థాయి పరిశీలకులను ప్రజలు నిలదీశారు. నగదు ఇస్తేనే పింఛన్ మంజూరు చేస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

prakasam district pamuru mpdo demanding money for new pensions
పింఛన్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న పామూరు ఎంపీడీవో రంగ సుబ్బారాయుడు

By

Published : Jun 12, 2022, 12:32 PM IST


Pensions: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్దలకేనా ? పేదలకు లేవా..? అంటూ ప్రకాశం జిల్లా పామూరులో క్షేత్రస్థాయి పరిశీలకులను ప్రజలు నిలదీశారు. పామూరు సచివాలయంలో వికలాంగ, వృద్ధాప్య, వితంతు పింఛన్ల అర్జీదారులతో అధికారులు సమావేశం నిర్వహించారు. వారంతా తీవ్రస్థాయిలో ఎంపీడీవో రంగ సుబ్బారాయుడుపై అవినీతి ఆరోపణలు చేశారు.

పింఛన్ల మంజూరు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఎంపీడీవో రంగ సుబ్బారాయుడు స్పందించడం లేదన్నారు. నగదు ఇస్తేనే పింఛన్ మంజూరు చేస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీడీవోను అధికారులు బయటకు పంపించి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్దలకేనా ? పేదలకు లేవా..?

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details