ప్రకాశం జిల్లాలో నర్సులు ఆందోళన బాట పట్టారు. పదేళ్లుగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులుగా పనిచేస్తున్నప్పటికీ తమను రెగ్యులర్ చేయలేదని వాపోయారు. తక్షణమే తమను రెగ్యులర్ చెయ్యాలన్న డిమాండ్‌తో కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ కాంట్రాక్టు, ఒప్పంద నర్సుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పూర్తి స్థాయి జీతాలు లేక, ఎలాంటి ఆదాయం లేకపోయిన రోజుకు 24 గంటలు పని చేస్తున్నామని అన్నారు. తమను రెగ్యులర్ చేసి.. స్టాఫ్ నర్సులుగా పదోన్నతి కల్పించాలని కోరారు.
ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని నర్సుల ఆందోళన - నర్సులు ఉద్యోగాలు రెగ్యూలర్ చేయాలని ఆందోళన వార్తలు
తమను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాలో నర్సులు నిరసన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ కాంట్రాక్టు, ఒప్పంద నర్సుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
ఉద్యోగాలు రెగ్యూలర్ చేయాలని నర్సులు నిరసన