ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతులు మినుము, బొబ్బర్లను సాగుచేశారు. నివర్ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దాదాపు చాలా పంట నష్టపోయారు. ఉన్న పంటను చూసుకునైనా నిబ్బరంగా ఉన్న రైతులను.. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కలవరపెడుతున్నాయి. పూర్తిగా పంట రాకముందే కోత కోసి నూర్పిళ్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 40 వేల హెక్టార్లలో పంటవేయగా.. 18వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.
వర్షాల భయం.. పూర్తిగా రాకముందే పంట కోస్తున్న రైతన్నలు - ప్రకాశం జిల్లా కనిగిరి రైతుల వార్తలు
నివర్ తుపాను అన్నదాతల కళ్లల్లో నీరు నింపింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలైంది. పోయింది పోగా ఉన్న పంటైనా చేతికొస్తుందేమో అని ఆశగా ఉన్న రైతులను 2 రోజులుగా కురుస్తున్న జల్లులు మరింత కలవరపెడుతున్నాయి. చేసేది లేక పూర్తిగా రాని పంటనే కోసేసి నూర్పిళ్లు చేస్తున్నారు.
![వర్షాల భయం.. పూర్తిగా రాకముందే పంట కోస్తున్న రైతన్నలు crop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9830164-571-9830164-1607599052277.jpg)
వర్షాల భయం.. పూర్తిగా రాకముందే పంట కోస్తున్న రైతన్నలు