ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల దాతృత్వం.. పేదలకు నిత్యవసర సరకుల పంపిణీ - Inkollu police helped the poor

కరోనా మహమ్మారిని నియంత్రించటానికి నిరంతరం శ్రమిస్తున్నారు పోలీసులు. కేవలం రక్షణ చర్యలే కాక ఆకలితో ఉన్న ఎంతో మంది నిరుపేదలకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఉదారత చాటుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు ప్రాంత పోలీసులు సైతం.. నిరుపేదలకు నిత్యవసర సరుకులు, బియ్యం అందించారు. సేవా గుణం చాటారు.

help to poor
పేదలకు నిత్యవసర సరుకులు

By

Published : May 26, 2021, 12:13 PM IST

కరోనా కారణంగా పనులు లేక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న పేదలకు.. ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు అండగా నిలిచారు. బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కడవకుదురు రహదారిలో గుడారాలు వేసుకుని జీవిస్తున్న పేదలను గమనించిన ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్ వివరాలు సేకరించారు. ఎస్ ప్రసాద్, ఇతర సిబ్బందితో కలిసి 20 కుటుంబాలకు బియ్యం అందజేశారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details