వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. ఉన్నత ఫలితాలు రాబడుతున్న ప్రకాశం జిల్లా పోలీసులను డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. ఆ జిల్లా ఎస్పీ, పోలీసు సిబ్బందితో సమావేశంలో.. ఎస్పీకి ప్రత్యేక ప్రశంసలు అందించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా బాధితులతో మాట్లాడిన డీజీపీ... జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు.
ప్రకాశం జిల్లా పోలీసుల 'స్పందన'.. ఆదర్శం: డీజీపీ - Spandana Program
ప్రకాశం జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులతో డీజీపీ గౌతం సవాంగ్ సమావేశమయ్యారు. స్పందన కార్యక్రమ నిర్వహణపై ఎస్పీని అభినందించారు. శాంతిభద్రతల దిశగా జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
డీజీపీ గౌతం సవాంగ్