ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవం - ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవం తాజా వార్తలు

ప్రకాశం జిల్లా ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులో స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

prakasam district golden jublee celebrations
ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవ కార్యక్రమం

By

Published : Feb 3, 2020, 9:44 AM IST

ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవ కార్యక్రమం

ప్రకాశం జిల్లా ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రాముఖ్యతను... విశిష్టతలను తెలిపేలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేడుకలను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రారంభించారు. జిల్లాకు చెందిన కళారూపాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వివిధ రకాల నృత్యాలు... ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితోపాటు , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు జబర్దస్త్ కామెడీ షో నటీనటులు హాజరై... తమదైన శైలిలో హాస్యాన్ని పండించారు. వీటిని తిలకించేందుకు నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం పంతులు గారి మనవడు గోపాలకృష్ణను కలెక్టర్, ప్రజాప్రతినిధులు సత్కరించారు. జిల్లా గురించి వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచిన పాటల సీడీని కలెక్టర్ ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details