ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలలపై అధ్యయనానికి నిపుణుల కమిటీ: మంత్రి అప్పలరాజు - prakasam district latest news

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య మంత్రి అప్పలరాజు సయోధ్య కుదిర్చారు. వివాదాస్పద వలలపై అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. అరెస్టుల ప్రక్రియ నిలిపేస్తామని, గతంలో నమోదైన కేసుల మాఫీకి ముఖ్యమంత్రితో చర్చిస్తామని ప్రకటించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/04-January-2021/10120009_ikj.jpg
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/04-January-2021/10120009_ikj.jpg

By

Published : Jan 5, 2021, 4:33 AM IST

మత్స్యకారులు వినియోగించే వివాదాస్పద వలలపై అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ వేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు. అది ఇచ్చే నివేదిక ఆధారంగా సమస్య శాశ్వత పరిష్కారానికి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలోని వాడరేవు, కటారివారిపాలెం గ్రామాల మధ్య నెలకొన్న వివాదం తీర్చేందుకు ఒంగోలులోని ప్రకాశం భవన్‌లోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర తీరంలో 8 కి.మీ.లోపు బల్ల, 0.5 అంగుళంలోపు ఉన్న ఐలా వలలను తాత్కాలికంగా నిషేధిస్తున్నామని చెప్పారు. సాంప్రదాయ బోట్లతో మంగళవారం నుంచి వేటకు వెళ్లడానికి అనుమతిస్తున్నామని, పరిస్థితులు చక్కబడే వరకు పోలీసు పహారా కొనసాగించాలన్నారు. వాడరేవు ఘర్షణ ఘటనలో జరిగిన నష్టంపై నివేదిక తయారు చేశామని, బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అరెస్టుల ప్రక్రియ నిలిపేస్తామని, గతంలో నమోదైన కేసుల మాఫీకి ముఖ్యమంత్రితో చర్చిస్తామని ప్రకటించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులతో తలదాచుకున్న వారికి నిత్యావసర సరకులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇరువర్గాలకు సయోధ్య కుదిర్చారు.

కొందరు రాజకీయ లబ్ధి పొందడానికి అతి చిన్న సమస్యను పెద్దది చేశారని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మత్స్యకారులంతా నిబంధనలకు లోబడి నడుచుకోవాలని ఎంపీ మోపిదేవి వెంకట రమణ సూచించారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ తీరంలో ఎనిమిది కి.మీ.లోపు మోటరైజ్డ్‌, మెకనైజ్డ్‌ బోట్లు వినియోగించరాదని చెప్పారు. జేసీ వెంకట మురళి, డీఆర్వో వినాయకం, ఏఎస్పీ బి.రవిచంద్ర, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • వివాదం నేపథ్యంలో పది మంది చొప్పున ఇరువర్గాలకు చెందిన మత్స్యకార ప్రతినిధులను మాత్రమే సమావేశానికి అనుమతించారు. మాజీ ఎమ్మెల్సీ సునీత వచ్చినా వేరే గదిలో కూర్చున్నారు. ఒంగోలు రెండో పట్టణ సీఐ రాజేష్‌ బందోబస్తు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details