ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదిగదిగో మూడో తారీఖు - ప్రకాశం జిల్లా తాజా కొవిడ్​ వార్తలు

జిల్లాలో మొత్తం 60 కరోనా పాటిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఒంగోలు 33, చీరాల 7 మిగతా ప్రాంతాల్లో ఇప్పటి వరకు 23 కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో రెండో విడత లాక్​డౌన్​ 3వ తారీఖున ముగుస్తుంది. దీంతో ఈ తారీఖు అనంతరం తమకు ఎలాంటి ఉపశమనం కలుగుతుందనే విషయంపైనా జిల్లా వాసులంతా దృష్టి సాగించారు.

prakasam district eagerly waiting for 2nd lockdown completion
అందరి దృష్టి ఆ తేదీ పైనే

By

Published : May 1, 2020, 10:11 AM IST

ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య పెరగడం వల్ల రెడ్​జోన్ల సంఖ్య పెరగింది. రెండోవిడత లాక్​డౌన్​ గడువు ఈ నెల మూడవ తేదీలో ముగుస్తుంది. లాక్​డౌన్​ ముగిసిన అనంతరం జిల్లాకు ఏ మేరకు మిహాయింపు ఉంటుంది... ఉపశమనం కలుగుతుందనే విషయాలపై జిల్లా వాసులు ఆలోచనలు సాగిస్తున్నారు. జిల్లాలో మొదట ఒంగోలు, చీరాల, కారంచేడు మాత్రమే రెడ్​జోన్లుగా ఉన్నాయి. అనంతరం ఆ సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పుడు ఎనిమిదికి వచ్చింది. ఆరెంజ్​ జోన్లు కూడా తొలుత ఏడు ఉన్నాయి. ఇప్పటికే రెడ్​, ఆరెండ్​ జోన్లలో అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలపై నిషేధం ఉంది. గురువారం వరకు పాటిటివ్​ కేసులను బట్టి 8 మండలాలు రెడ్​, 9 మండలాలు ఆరెండ్​, మిగిలిన 39 మండలాలు గ్రీన్​జోన్​ల జాబితాలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 60 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఒంగోలు 33, చీరాల 7, కందుకూరు 3, కారంచేడు 4, గుడ్లూరు 5 మిగిలివి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇప్పటివరకు 23 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

అందరి దృష్టి ఆ తేదీ పైనే

ABOUT THE AUTHOR

...view details