ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద వలస కూలీలు నడుచుకుంటూ వారి స్వస్థలాలకు వెళుతున్నారు. 60 మంది ఒడిశా వలస కూలీలను మార్టూరు పోలీసులు గుర్తించి వారందరికీ ఆహారాన్ని అందించారు.
అందరినీ రిలీఫ్ కేంద్రానికి తరలించారు. ఆహారం, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు అందించారు. ప్రత్యేక బస్సుల్లో అందరినీ పంపేవిధంగా చర్యలు చేపడతామని ఎస్.ఐ శివకుమార్ వారికి హామీ ఇచ్చారు.