పథకాలను ప్రజలకు త్వరితగతిన అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. వేటపాలెం మండలం పుల్లరిపాలెం గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో గ్రామ సచివాలయాలు 879, వార్డు సచివాలయాలు 177 ఉన్నాయని పోలా భాస్కర్ వెల్లడించారు. వారంలో మూడు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. సచివాలయ సిబ్బంది ఇబ్బందులు, వారి పనితీరు పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.