ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' వస్త్ర దుకాణాలు తెరవడానికి అనుమతులివ్వండి' - చీరాలలో వస్త్ర వ్యాపారులు

ప్రకాశం జిల్లా చీరాలలో వస్త్ర దుకాణాలు తెరవడానికి అనుమతులు కోరుతూ.. వ్యాపారులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. లాక్​డౌన్ కారణంగా ఇప్పటికే చాలా నష్టపోయామని.. ఇకనైనా వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాలని కోరారు.

prakasam district chirala cloth merchants request to open shops
అధికారులకు వినతి పత్రం అందజేస్తున్న వ్యాపారులు

By

Published : Jul 11, 2020, 9:25 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో కొవిడ్ కారణంగా మూతపడిన వస్త్ర దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతులు ఇవ్వాలని వ్యాపారులు కోరారు. ఈ మేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మార్చి 22 నుంచి లాక్​డౌన్ పాటిస్తున్నామని.. దీని ద్వారా ఇప్పటికే చాలా నష్టపోయామని వ్యాపారులు చెప్పారు.

వ్యాపార సంస్థల్లో పనిచేసే గుమస్తాలకు జీతాలు, దుకాణాల అద్దెలు, విద్యుత్ బిల్లులు, పన్నులు తదితరాలు చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వస్త్ర వ్యాపారుల లావాదేవీలు చాలా వరకు అప్పులతో ఉంటాయని.. లాక్​డౌన్ కారణంగా రుణం వసూలు చేయడం కష్టమయిందని తెలిపారు. ఈ క్రమంలో దుకాణాలు తెరవడానికి అనుమతులు ఇవ్వాలని కమిషనర్ రామచంద్రారెడ్డి, ఆర్డీవో, డీఎస్పీలకు వినతిపత్రాలు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details