కరోనా పాజిటివ్ కేసుల నమోదు నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలను రెడ్ జోన్ ప్రాంతంగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నిత్యావసర సరకులు, కూరగాయలు, పాలు అందుబాటులో ఉంచారు. ఇంటింటికీ వాటిని సరఫరా చేస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. బయటికి రాకుండా లాక్ డౌన్ నిబంధనలు పాటించాలన్నారు.
కరోనా ఎఫెక్ట్: రెడ్ జోన్‌గా చీరాల - చీరాలలో కరోనా కేసులు తాజా వార్తలు
కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలను రెడ్ జోన్ ప్రాంతంగా ప్రకటించారు. ఇక్కడి ప్రజలు బయటకు రాకుండా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందుబాటులో ఉంచుతామని అధికారులు ప్రకటించారు.
రెడ్ జోన్ ప్రాంతంగా చీరాల