ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో వైకాపాకు ఓట్లు వేయలేదని దాడి.. - వైకాపాకు ఓట్లు వేయలేదని దాడి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఓ వర్గం వారిపై జరుగుతున్న దాడులు ఆగడంలేదు. రాష్ట్రా విద్యాశాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే దాడులు జరుగుతుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో వైకాపాకు ఓట్లు వేయలేదని దాడి
ప్రకాశం జిల్లాలో వైకాపాకు ఓట్లు వేయలేదని దాడి

By

Published : Oct 17, 2021, 7:50 PM IST

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లిలో ఓ వర్గం వారిపై దాడి ఘటన మరువకు ముందే.. అదే మండలంలోని మద్దలకట్టలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన సోదరులు మూల సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఓటమి పాలయ్యారు. తమ ఓటమికి కారణమయ్యారంటూ... వారు తంగిరాల జార్జి అనే వ్యక్తిపై దాడికి దిగారు. వైకాపాకు ఓట్లు వేయలేదనే కారణంతోనే.. కావాలనే తగాదా పెట్టుకుని దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details