ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడ్ కూసినా... ముసుగు పడలేదు! - prakasam district latest news

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా యంత్రాంగం అలసత్వాన్ని వీడలేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ... కొన్ని చోట్ల నేతల విగ్రహాలపై ముసుగులు వేయలేదు. అలాగే కార్యాలయాల్లో సీఎం జగన్​ చిత్ర పటాలను తొలగించలేదు.

election code
election code

By

Published : Jan 30, 2021, 3:37 PM IST

సచివాలయంలో సీఎం చిత్రబపటం

పంచాయతీ ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ ఒక వైపు జరుగుతున్నా... ఎన్నికల నియమావళిని ప్రకాశం జిల్లా యంత్రాంగం పట్టించుకోవటం లేదు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాల నియంత్రణపై దృష్టి సారించటం లేదు. పార్టీల ఫ్లెక్సీల తొలగింపు, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసే విషయంలో ఎవరూ శ్రద్ధ చూపడం లేదు.

సంతనూతలపాడులో ముసుగు లేని విగ్రహాలు

సంతనూతలపాడు మండల కేంద్రంలో ప్రముఖ రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయలేదు. స్థానిక సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫోటో దర్శనమిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ జరిగే కార్యాలయాల్లోనూ ముఖ్యమంత్రి ఫోటోలు తొలగించకపోవటం విమర్శలకు తావిస్తోంది.

మైనంపాడులోని సచివాలయంపై సీఎం ఫోటో

ABOUT THE AUTHOR

...view details