ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహమ్మారిపై అవగాహన.. మాస్క్ లేకుంటే జరిమానా - prakasam dist latest news

వైరస్ వ్యాప్తి నియంత్రణకు చీరాల పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ లేకుండా బయట తిరిగే వారికి జరిమానా విధించి, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి అవగాహన కల్పిస్తున్నారు.

WITHOUT_MASK_FINE
మాస్క్ లేకుంటే జరిమాన

By

Published : Nov 11, 2020, 3:21 PM IST

చాపకింద నీరులా కరోనా వ్యాపిస్తున్నా కొందరు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి ప్రకాశం జిల్లా చీరాలలో సచివాలయ సిబ్బంది, పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరిగే అన్ని రకాల వాహన చోదకులకు రూ. 100 జరిమానా విధించి, ముసుగులు అందిస్తున్నారు. మహమ్మారిపై అవగాహన కల్పిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించకుండా బయటికొస్తే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details