ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కట్టడికి అధికారులు సమన్వయంతో పని చేయాలి' - జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టర్ పోలా భాస్కర్

ప్రకాశం జిల్లాలో కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు.. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. కొవిడ్ కట్టడికి అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

collector pola bhaskar
collector pola bhaskar

By

Published : May 22, 2021, 8:22 PM IST

కొవిడ్ కట్టడికి అధికారులు సమన్వయంతో పని చేయాలని.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సూచించారు. చీరాల మున్సిపల్ ఓపెన్ ఎయిర్ ధియేటర్​లో చీరాల, పర్చూరు నియోజకవర్గాల అధికారులకు జిల్లా కలెక్టర్ కొవిడ్ మేనేజ్​మెంట్​పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు. జిల్లాలో కొవిడ్ రెండో దశ వివిధ రకాలగా మార్పులు చెందుతుందన్నారు.

జిల్లాలో కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామ స్థాయిలో కొవిడ్ మేనేజ్​మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో కరోనా మేనేజ్​మెంట్ కమిటీలు ఏర్పాటుచేసి వాటిలో గ్రామస్థులను భాగస్వాములుగా చేయాలని సూచించారు. గ్రామాన్ని ఒక యూనిట్​గా తీసుకుని కొవిడ్ మేనేజ్​మెంట్ ను ఆమలు చేయాలని అన్నారు. గ్రామస్థాయిలో కరోనా నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మండల కొవిడ్ వార్​రూమ్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయాలని మండలస్థాయి అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 45 సంవత్సరాలకు పైబడిన వారిలో 10 మందికి ప్రతి రోజు వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details