ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: ఎస్పీ సిద్ధార్థ కౌశిల్‌ - prakasam politics

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా సిద్ధార్థ కౌశిల్‌ బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలల క్రితమే విధుల్లో చేరిన కోయా ప్రవీణ్​ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. రాత్రి బదిలీ కావడం, తెల్లారేసరికి నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించడం చర్చనీయాంశమైంది. అరుణాచల్​ప్రదేశ్‌కు చెందిన ఎస్పీ సిద్ధార్థ కౌశిల్‌కు ఎస్పీగా ఇదే తొలి పోస్టింగ్‌.

మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ కౌశిల్‌

By

Published : Apr 10, 2019, 5:08 PM IST

ఎస్పీ సిద్ధార్థ కౌశిల్‌

ప్రకాశం జిల్లాలో గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. 12 అసెంబ్లీ, ఒంగోలు, బాపట్ల లోక్​సభకు సంబంధించి దాదాపు 26,32,407 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. 3,269 పోలింగ్‌ కేంద్రాల్లో 8,288 ఈవీఎంలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు దాదాపు 1600 ఈవీఎంలు సిద్ధం చేశారు. సుమారు 26వేల మంది పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

35,945 మంది దివ్యాంగ ఓటర్లుండగా వీరికి సహాయకులు, వాహనాలు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భద్రత పరంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 63 స్ట్రైకింగ్‌ ఫోర్స్​లు, 12 కంపెనీల రిజర్వు పోలీసులు, 1200 మంది సివిల్‌ పోలీసులు ఎన్నికల విధుల్లో పని చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details