ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో గుట్కా నిల్వలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు జరిపి... నిషేధిత గుట్కా, ఖైని ప్యాకెట్లు భారీ స్థాయిలో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు... పలు దుకాణాల్లో దాడులు నిర్వహించి 12 గోనే సంచులలో నిల్వ ఉంచిన, సుమారు లక్ష రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
లక్ష రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - ఈటీవీ భారత్ తెలుగు తాజా వార్తలు
ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణంలో గుట్కా నిల్వలపై పోలీసులు దాడులు జరిపారు. సుమారు లక్ష రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

లక్ష రూపాయల విలువ గల గుట్కా స్వాధీనం