మాస్క్ లేనిదే ప్రవేశం లేదు.. మాస్కు ఉంటేనే పట్టణంలోకి రండి.. అంటూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు వినూత్నంగా పిలువునిస్తూ.. చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా.. సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి చెక్‌పోస్టులు పెట్టారు. ఇంకొల్లు గ్రామం లోనికి ప్రవేశించే అన్ని రోడ్ల వెంట.. చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. మాస్క్ లేకుండా వస్తున్న వారిని ఇంకొల్లు లోపలకి వెళ్లనియకుండా వెనక్కి పంపిస్తున్నారు. మాస్క్ ఉంటేనే ఇంకొల్లులోనికి ప్రవేశం ఉంటుంది.. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి కరోన బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సీఐ అట్లఫ్ హుస్సేన్ కోరారు.
కరోనా ఎఫెక్ట్: ఇంకొల్లు పోలీసుల కఠిన ఆంక్షలు - ఈరోజు ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు కఠిన ఆంక్షలు వార్తలు
కరోనా వ్యాపిస్తున్న దృష్ట్యా ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు.. పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. గ్రామం చుట్టూ.. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. మాస్కు ధరిస్తేనే.. గ్రామంలోనికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. లేకుంటే తిరిగి పంపిస్తున్నారు.
![కరోనా ఎఫెక్ట్: ఇంకొల్లు పోలీసుల కఠిన ఆంక్షలు police tight restrictions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11457034-674-11457034-1618815648468.jpg)
ఇంకొల్లు పోలీసులు కఠిన ఆంక్షలు