బయట తిరగొద్దని ఎంత చెప్పినా... ప్రజలు పెడచెవిన పెడుతున్నారని వినూత్న రీతిలో చర్యలు చేపట్టారు ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు. ఏ పనీ లేకపోయినా రోడ్లపై తిరుగుతూ లాక్డౌన్ను ఉల్లంఘించిన వాహన చోదకులను రోడ్డుపై నడిపించారు. ఈ విధంగా చేస్తేనైనా ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉంటారని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
బండి దించారు... నడిపించి మరీ గుణపాఠం చెప్పారు - lock down in ongole
అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులకు పోలీసులు తగిన శిక్షే వేశారు. లాక్డౌన్ను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారు మరోసారి రోడ్లపైకి రావాలంటే భయానికి గురయ్యేలా చేశారు.
ఒంగోలులో వాహనదారులకు పోలీసుల గుణపాఠం